ఆయుష్ శాఖ పోస్టులకు 22న రాత పరీక్ష

18-11-2026 | 04:47pm

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

భూపాలపల్లి, నవంబర్ 18 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయుష్ శాఖ(AYUSH Department) పరిధిలో మల్టీ పర్పస్ వర్కర్ పోస్టుల భర్తీకి ఈ నెల 22న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) తెలిపారు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జి-36 సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, మొత్తం 98 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో జారీ చేసిన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డుతో ఉదయం 10:30 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షకు సంబంధించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు