సీనియర్ సిటిజెన్లు మనో నిబ్బరం కలిగి ఉండాలి

18-11-2026 | 08:22pm

జగిత్యాల, నవంబర్ 18 ( విజయక్రాంతి ) : సీనియర్ సిటిజెన్లు(Senior Citizens) మనోనిబ్బరం కలిగి ఉండాలని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్(Telangana All Senior Citizens Association) జగిత్యాల జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్(Hari Ashok Kumar) అన్నారు. బుధవారం అసోసియేషన్ కార్యాలయంలో వృద్దుల్లో ఆత్మహత్యల నివారణ(Suicide Prevention)- పిల్లల బాధ్యత అనే అంశం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా పేద వృద్ధులకు(Poor elderly people) అసోసియేషన్ తరపున హరి అశోక్ కుమార్ చేతుల మీదుగా శీతాకాలం దృష్ట్యా నిరుపేద వృద్ధులకు బ్లాంకెట్లు, స్వేట్టర్లు అందజేశారు. అనంతరం హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ వృద్ధులకు పలు సమస్యల్లో అవగాహన కల్పించారు.

వృద్ధులు ఎక్కడ ఆత్మహత్యలు చేసుకున్నా పోలీసులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలన్నారు. కనిపెంచిన వృద్ధ తల్లిదండ్రులను హింసలకు గురి చేస్తు ఆస్తులను బలవంతంగా  కొడుకులు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నా పోషించక, ఇండ్ల నుంచి గెంటి వేయడం, వంతుల వారీగా పోషిస్తామనడం వృద్దాశ్రమంలో చేర్పించడం వంటి విషయాల్లో ఆర్డీవో లకు, పోలీస్ అధికారులకు, తమ అసోసియేషన్ కు ఫిర్యాదు చేయాలన్నారు.

తల్లిదండ్రులను పోషించక నిరాధరణకు గురి చేస్తే ఆర్డీవో ఆరు మాసాల వరకు జైలు శిక్ష విధించే వీలుందని, ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే తిరిగి తల్లి దండ్రుల పేరిట కలెక్టర్ మార్చే వీలు చట్టం లో ఉందని వివరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వ నాథమ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. సి. హన్మంత్ రెడ్డి, పూసాల అశోక్ రావు, జిల్లా కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు, ఆర్గనైజింగ్ కార్యదర్శులు సత్యనారాయణ, కరుణ, ఎం. డి. యాకూబ్ టీబీసీ జేఏ సీ జిల్లా అధ్యక్షురాలు జలజ, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు