ఉద్యోగులకు టీఎన్జీవో సంఘం అండగా ఉంటుంది
జగిత్యాల జిల్లా రోడ్లు భవనాల శాఖలో టీఎన్జీవోల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం
జగిత్యాల, నవంబర్ 25 (విజయక్రాంతి): ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేనిల పిలుపు మేరకు జగిత్యాల జిల్లా టీఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు మిర్యాల నాగేందర్ రెడ్డి(Miryala Nagender Reddy), జిల్లా కార్యదర్శి ఊకంటి అమరేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో రోడ్లు, భవనముల శాఖలో ఉద్యోగుల సమావేశం నిర్వహించి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగినది.
ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలైన సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు, నూతన పిఆర్సి అమలు, పెండింగ్ డిఏ లు, పెండింగ్ బిల్లుల విడుదల, ఉద్యోగుల సంబందించిన ఇతర సమస్యలన్ని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేని ల కృషి తో సమస్యలన్నీ పరిష్కరామవుతాయని తెలిపారు. జిల్లా కార్యదర్శి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల కు టిఎన్జీఓ సంఘం ఎల్లప్పుడు అండగా ఉంటుందని, అందరూ సభ్యత్వ నమోదు చేసుకోవాలని అన్నారు.
ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జగిత్యాల జిల్లా రోడ్లు, భవనముల శాఖ ఉద్యోగులు పాల్గొని టిఎన్జీవో సంఘం యొక్క సభ్యత్వం తీసుకోవడం జరిగినది. తదుపరి ఇటీవలే జిల్లా కు బదిలిపై విచ్చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రావణ్ ప్రకాశ్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీఓ జిల్లా కోశాధికారి సాహెద్ బాబు, ఉపాధ్యక్షులు రవిచంద్ర, నాయకులు శ్రీనివాస్, టీజీవో నాయకురాలు ఉమేశ్వరి, ఉద్యోగులు కిషన్, అభిలాష, శ్రీకాంత్, దామిని, సత్యనారాయణ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.