వి బి జి రాంజీ పనుల పరిశీలన

27-11-2026 | 06:57pm

భైంసా ( విజయక్రాంతి) : కుంటాల మండలంలోని(Kuntala Mandal) పలు గ్రామాల్లో విబిజి రాంజీ(VBG Ramji) ద్వారా చేపట్టిన పనులను ప్రత్యేక అధికారి జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులు(Employment guarantee works) చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులు పక్కాగా ప్రజలకు ఉపయోగపడేలా చేపట్టాలని సిబ్బందికి సూచించారు. పనుల్లో అక్రమాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కట్ట రవి నాయకులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు