తండ్రిని ఇంట్లోంచి గెంటేసిన కొడుకు
జగిత్యాల, నవంబర్10 ( విజయక్రాంతి ) : జగిత్యాల జిల్లా(Jagtial District) వెల్గటూర్ మండలం శాలపల్లి గ్రామానికి చెందిన లైశెట్టి రాజయ్య (91) అనే వృద్ధ తండ్రిని తన కొడుకు రాజమొగిలి పోషణ, వైద్య ఖర్చులు(Medical expenses) పెట్టక కొట్టి ఇంట్లోంచి గెంటి వేసిండని జగిత్యాల జిల్లా కేంద్రం లోని సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించాడు. కాగా మంగళవారం సీనియర్ సిటిజెన్స్ ప్రతినిధులతో వెళ్లి ఆర్డీవో కు ఫిర్యాదు చేయగా వయో వృద్ధుల సంరక్షణ, పోషణ చట్టం(Maintenance Act) కింద కేసు నమోదు(Case registration) చేశారు. అనంతరం ఆ వృద్ధ తండ్రి సీనియర్ సిటిజెన్స్ కార్యాలయం(Senior Citizens Office) లో తన గోడు విలేకరులకు వినిపించారు.
తన ఏకైక కొడుకు రాజ మొగిలి నా బాగోగులు చూసుకుంటానని నమ్మించి తన పట్టా భూమి 1 ఎకరం 20 గుంటలు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని నేను కాయ కష్టంతో జీవితావరాల కోసం దాచుకున్న 8 లక్షల 70 వేలు సైతం తీసుకొని నాకు తిండి పెట్టక అనారోగ్యం తో ఉన్నా కనికరం చూపక కొట్టి బలవంతంగా నేను కట్టిన నా ఇంట్లోంచి బలవంతంగా వెళ్ళ గొట్టాడని, నా కొడుకు నా ఇంటిలో నన్ను ఉంచుకొని నన్ను పోషిస్తూ ప్రతి నెలా రూ. 10 వేలు పోషణ వైద్య ఖర్చులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, నా కొడుకు కు నేను చేసిన 1ఎకరం 20 గుంట ల భూమి గిఫ్ట్ డీడ్ ను రద్దు చేసి నా పేరిట మార్పించాలని, నేను ఇచ్చిన 8 లక్షల 70 వేలు నాకు ఇప్పించాలని సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ను ఆశ్రయించి ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా తన కొడుకు పై, కేసు నమోదు చేశారని, ఎస్పీ కి సైతం ఫిర్యాదు చేస్తానని ఆ వృద్ధ తండ్రి విలేకరుల ముందు ఏడుస్తు చెప్పిండు. ఆ వృద్ధ తండ్రి వెంట సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్, చట్టం కాన్సిలియేషన్ అధికారులు పి. సి. హన్మంత్ రెడ్డి, వెల్ముల ప్రకాష్ రావు తదితరులున్నారు.