ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలి

10-11-2026 | 07:23pm

శ్రీ కాలభైరవ స్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం

రామారెడ్డి, నవంబర్‌ 10 (విజయక్రాంతి): శ్రీ కాలభైరవ స్వామి ఆలయ(Sri Kalabhairava Swamy Temple) అభివృద్ధికి భక్తులు, దాతల సహకారం ఎంతో అవసరమని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు చింతల శంకర్‌ అన్నారు. మంగళవారం ఆలయంలో పాలకవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ కాలభైరవ స్వామి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు, దాతలు తమకు తోచిన విధంగా విరాళాలు అందించి సహకరించాలని కోరారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సహకారంతో ప్రభుత్వ నిధులు తీసుకువచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపడతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలయ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు