విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
మైనర్ డ్రైవింగ్, గంజాయి, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన
బాన్సువాడ, నవంబర్ 10 (విజయక్రాంతి): యువత చెడు వ్యసనాలకు, మోసాలకు(Youth is prone to bad habits, fraud) ఆకర్షితులు కాకుండా మంచి లక్ష్యంతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలను(High peaks) అధిరోహించాలని పోలీసు అధికారులు(Police officers) విద్యార్థులకు సూచించారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ మండలంలోని హన్మాజీపేట ఉన్నత పాఠశాలలో మంగళవారం కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ(Police Department) ఆధ్వర్యంలో విద్యార్థులకు సామాజిక అంశాలపై(Social issues) అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు, బాన్సువాడ సీఐ టి.శ్రీధర్ సూచనలతో ఎస్ఐ వెంకట్రావు ఆధ్వర్యంలో పోలీసు కళాబృందం సభ్యులు మాటలు, పాటలు, కళారూపాల ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రేమ పేరుతో మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదకద్రవ్యాల వినియోగం, సైబర్ నేరాలు, మైనర్లపై జరిగే నేరాలు, మహిళల భద్రత, పోక్సో చట్టం తదితర అంశాలను వివరించారు. సోషల్ మీడియా వేదికలైన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లను జాగ్రత్తగా వినియోగించాలని, అపరిచితులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
చిన్న పొరపాట్లు సైతం భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ క్రమశిక్షణతో చదువుకోవాలని తెలిపారు. మూఢనమ్మకాలకు దూరంగా ఉంటూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని, ఎలాంటి నేరాలకు పాల్పడకుండా బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
బాన్సువాడ షీ టీమ్ విధులు, మహిళల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, పోక్సో చట్టం, మైనర్లపై జరిగే నేరాలపై పోలీసు సిబ్బంది అనిల్, డబ్ల్యూపీసీ పార్వతి వివరించారు.ఈ కార్యక్రమంలో పోలీసు కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ యు.శేషారావు, పోలీసు కానిస్టేబుల్ ప్రభాకర్ పాల్గొని పాటలు, సందేశాల ద్వారా విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య-వెంక గౌడ్, ఉపసర్పంచ్, మాజీ సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.