బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
గణపురం, నవంబర్ 10 (విజయక్రాంతి): గణపురం మండలానికి చెందిన బీఆర్ఎస్ యువ నాయకుడు గాజర్ల చింటూ గౌడ్–ప్రసన్న దంపతుల రెండు నెలల చిన్నారి మృతి చెందగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి గండ్ర వెంకటరమణారెడ్డి(Former MLA Gandra Venkataramana Reddy) మంగళవారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం బుద్ధారం గ్రామంలో కతేరశాల లింగయ్య చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోతె కరుణాకర్‌రెడ్డి, నాయకులు పోలుసాని లక్ష్మీనరసింహారావు, పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, ఉడుత సాంబయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.