చేతిపంపులకు మరమ్మతులు చేయించిన పాలకవర్గం

03-11-2026 | 05:08pm

పాలకవర్గాన్ని అభినందించిన మల్లాపూర్ ప్రజలు

మల్లాపూర్, నవంబర్ 3 (విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ(Major Gram Panchayat) పరిధిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పాలకవర్గం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమారెడ్డి, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మూడు చేతిపంపులకు మరమ్మతులు చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

మండల కేంద్రంలోని 14వ వార్డు, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం మూడు చేతిపంపులకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

ప్రజల అవసరాలను గుర్తించి ముందస్తుగా చేతిపంపులకు మరమ్మతులు చేయించిన గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని మల్లాపూర్ ప్రజలు అభినందించారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మి, ఏవీఆర్, కార్యదర్శి గూరుడు శ్రీనివాస్, కాషవత్తుల లక్ష్మి, గంగా రెడ్డి, భుక్యా శేఖర్, సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు