రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సీనియర్ పాత్రికేయుడు

03-11-2026 | 05:37pm

ముత్తారం, నవంబర్ 03 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరు ప్రధాన రహదారిపై(Pannuru Main Road) ఇటీవల పంది అడ్డురావడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ముత్తారం మండలానికి చెందిన పాత్రికేయుడు ఏలువాక కుమార్ స్వామిని ముత్తారం ఎస్ఐ రవికుమార్(Muttaram SI Ravikumar) పరామర్శించారు.

ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత  ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరాలని ఆకాంక్షించారు. ప్రమాదాలు జరగకుండా వాహనదారులు రహదారులపై అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

మరిన్ని వార్తలు