మండలానికి 17 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు
వెంకటాపురం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్
వెంకటాపురం నూగూరు నవంబర్ 3 (విజయక్రాంతి): వెంకటాపురం మండలంలోని రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క(Minister Seethakka) భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు ఆదేశాల మేరకు వెంకటాపురం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మండలంలోని ఆర్ అండ్ బి రోడ్లు పాలెం వాగు సంబంధించిన బ్రిడ్జిలు మంజూరు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్లాడుతూ వెంకటాపురం మండలంలోని ప్రతి పంచాయతీలో రోడ్లను బాగు చేస్తూ దాదాపు మన మండలానికి 17 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని మంత్రి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకటరావు ఎంతో కృషి చేశారని సూచించారు. ఈ కార్యక్రమానికి మండల ప్రజలందరు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ కోరారు.