గ్రామాలను పరిశుభ్రవంతంగా తీర్చిదిద్దుకోవాలి
ఎంపీడీవో వరుణ్ కుమార్
గోవిందరావుపేట, నవంబర్ 3 (విజయక్రాంతి): గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దుకోవాలని జిల్లాలోని మండలాన్ని ఆదర్శ ఆరోగ్యవంతమైన మండలంగా(A Healthy Zone) గుర్తించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎంపీడీవో చిలువేరు వరుణ్ కుమార్(MPDO Chiluveru Varun Kumar) పిలుపునిచ్చారు.
మండలంలోని చల్వాయి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామాభివృద్ధి పారిశుధ్య నిర్వహణలో భాగంగా మంగళవారం కమ్యూనిటీ సోక్‌పిట్, పశువుల కోసం నీటి తొట్టెల నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మేకల రాధా సుదర్శన్, ఉపసర్పంచ్ భూరెడ్డి మధుసూదన్ రెడ్డి, వార్డు సభ్యులు,
ఈజీఎస్ ఈసీ, టీఏ, ఎఫ్ఏ, మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్య మెరుగుదల, మురుగునీటి నిర్వహణ, పశువులకు తాగునీటి సౌకర్యం కల్పించడం ద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు ఈ పనులు ఎంతగానో దోహదపడతాయని తెలియజేయడం జరిగింది.