కేసీఆర్ సంకల్పం.. హరీష్ రావు పునాది

25-11-2026 | 10:15pm

జనగామకు వైద్య విప్లవం

జనగామ, నవంబర్ 25 (విజయక్రాంతి): జిల్లాల పునర్విభజన తర్వాత ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల(Jangaon Medical College) మంజూరు చేస్తూ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీజం వేసింది. అందులో భాగంగా జనగామకు రూ.154 కోట్లతో మెడికల్ కాలేజీ మంజూరు చేసి ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు భూమి పూజ చేశారు. ఆ నిర్ణయ ఫలితంగా ఇప్పుడు జనగామకు మహర్దశ పట్టింది.

జనగామ మెడికల్ కాలేజీ భవనం, క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభోత్సవానికి ఈ నెల 27న ముహూర్తం నిర్ణయించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నెల 23న సచివాలయంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. దీంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కళాశాల ఆవరణలో చివరి దశ పనులు, పరిశుభ్రత కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి.

క్రిటికల్ కేర్‌కు ప్రహరీ గోడ లేదు:

చంపక్ హిల్స్‌లో మాతా శిశు సంరక్షణ ఆస్పత్రి సమీపంలో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించలేదు. పట్టణానికి 3 కి.మీ. దూరంలో ఉన్న యూనిట్‌కు భద్రత లేకుండా పోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రహరీ గోడ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు