రేపు జనగామకు ఇద్దరు మంత్రులు

29-11-2026 | 03:11pm
  • జనగామ, నవంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి. దామోదర రాజనర్సింహ, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోమవారం (నవంబర్ 30) జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

    పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 3 గంటలకు మంత్రులు జనగామకు చేరుకుంటారు. ముందుగా చంపక్ హిల్స్‌లో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ (CCU) బ్లాక్‌ను ప్రారంభిస్తారు. అనంతరం గీతాశ్రమం వద్ద ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల (Medical College), వసతి గృహ భవనాన్ని ప్రారంభించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు జనగామ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

మరిన్ని వార్తలు