బచ్చన్నపేటలో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి
బచ్చన్నపేట. నవంబర్ 28 (విజయక్రాంతి) : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో(Gram Panchayat Office) మహాత్మా జ్యోతిరావు పూలే(Mahatma Jyotirao Phule) వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ అల్వాల నర్సింగరావు(Sarpanch Alvala Narsing Rao) ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూలే గారు సమాజంలో వేళ్లూనుకున్న కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలపై(social inequalities) జీవితాంతం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త అని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా మహిళా విద్యకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను కొనియాడారు.
తన సతీమణి సావిత్రిబాయి పూలేతో కలిసి బాలికల కోసం పాఠశాలలు ప్రారంభించి, ఆడపిల్లల చదువుకు బాటలు వేసిన మహనీయుడు పూలే అని పేర్కొన్నారు.బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, మురళి, మల్లేష్, గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు