మార్చి నాటికి గజ్వేల్ కోర్టు భవన నిర్మాణం పూర్తి చేయాలి

28-11-2026 | 06:06pm

నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు ఆదేశించిన జిల్లా న్యాయమూర్తి జి. సుదర్శన్

గజ్వేల్, నవంబర్ 28 : గజ్వేల్ పట్టణంలో(Gajwel town) నిర్మాణంలో ఉన్న నూతన కోర్టు భవన(Court building) పనులను మార్చి నెలలోగా పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లా న్యాయమూర్తి జి. సుదర్శన్(Siddipet District Judge G. Sudarshan) ఆదేశించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆర్‌అండ్‌బీ శాఖతో(Roads and Buildings Department) పాటు సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేసేలా కాంట్రాక్టర్, ఆర్‌అండ్‌బీ అధికారులకు(R&B officials) స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నూతన కోర్టు భవన నిర్మాణంలో జాప్యం లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మూల స్వాతి గౌడ్, గజ్వేల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏ. కిరణ్ సాగర్ రావు, సిఐ రవికుమార్, ఉపాధ్యక్షుడు నరేష్ చారి, కార్యదర్శి కరుణాకర్, స్పోర్ట్స్ సెక్రటరీ అబ్దుల్ గఫార్, కోశాధికారి సీహెచ్. అశోక్, కార్యవర్గ సభ్యులు రామకృష్ణ, పరమేష్, సీనియర్ న్యాయవాదులు జి. కాళీ ప్రసాద్, ఏ. పార్థసారథి రాజు, సీహెచ్. పాండరి, వనం భాస్కర్ తదితరులు, కోర్టు సూపరింటెండెంట్, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు