ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు
ముకరంపుర,(విజయక్రాంతి) మహాత్మ జ్యోతిరావు పూలే(Mahatma Jyotirao Phule) ఆశయ సాధనకు, వారు చూపిన సమసమాజ స్థాపన మార్గంలో పయనించేందుకు నేటి యువత, ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Deputy Mayor Yadagiri Sunil Rao) పిలుపునిచ్చారు. సమాజంలోని అసమానతలను రూపుమాపడానికి పూలే చేసిన త్యాగాలు మరువలేనివని, మహిళా సాధికారతకు ఆనాడే బలమైన పునాదులు వేశారని ఆయన కొనియాడారు. సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ బిజెపి ఓబీసీ మోర్చా(Karimnagar BJP OBC Morcha) ఆధ్వర్యంలో నగరంలో ఘనంగా సంస్మరణ వేడుకలు నిర్వహించారు.
కరీంనగర్ విద్యానగర్లోని శాతవాహన యూనివర్సిటీ సమీపంలో గల మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల నినాదాల మధ్య పూలే సేవలను స్మరించుకుంటూ జోహార్లు అర్పించారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ ముర్చా జిల్లా అధ్యక్షులు ఆకుల రాజేందర్, కార్పొరేటర్లు బోయినిపల్లి ప్రవీణ్ రావు, ఎన్నం ప్రకాష్, గాజ శివరాం, కర్రే అనిల్ కుమార్, బిజెపి నాయకులు గుజ్జ శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.