ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా చేసుకుంటే 5 లక్షలు ధీమా

28-11-2026 | 06:08pm

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాసానిపల్లి గ్రామం(Masani Palli Village)లో గ్రామ సర్పంచ్ పెద్దపట్లోళ్ల సునంద కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ(Gram Sabha) నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి సుభాష్ రెడ్డి ఆదాయవ్యాయాల గురించి చదివి వినిపించారు. పోచారం ప్రధాన కాలువ నుండి డిస్ట్రిబ్యూటర్ 33 పంట పొలాలకు వెళ్లే కాలువ చెత్త చెదారంతో నిండిపోయి నీటి ప్రవాహం సరిగ్గా వెళ్లడం లేదని,ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా డిస్ట్రిబ్యూటర్ 33 కాలువలో పూడికతీత పనులు చేపట్టాలని తీర్మానించారు.

18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు లోపు ఉన్న ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా  చేసుకోవాలని,ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా చేసుకుంటే ఐదు లక్షలు ధీమా వర్తిస్తుందని,ఇంటి పన్ను,నీటి బిల్లు కట్టాలని, ఉపాధి పనులకు ప్రతి ఒక్కరు హాజరుకావాలని, ఇంకుడు గుంతలు,ఫామ్ పౌండ్ పనులు గ్రామ సభలో తీర్మానించినట్లు గ్రామ సర్పంచ్ పెద్దపట్లోళ్ల సునంద కిషన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దపట్లోళ్ల సునంద కిషన్ రెడ్డిపంచాయతీ కార్యదర్శి సుభాష్ రెడ్డి,ఉప సర్పంచ్ గంగరబోయిన దుర్గవ్వ,కారోబార్ బైండ్ల నర్సింలు,వార్డ్ మెంబర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు