ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సర్టిఫికెట్ల ప్రదానోత్సవం

28-11-2026 | 06:10pm

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఎర్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళల స్వావలంబన, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా టైలరింగ్, బ్యూటీషియన్, కంప్యూటర్ మరియు మగ్గం వర్క్ కోర్సుల్లో గత 11 నెలలుగా కేవలం రూపాయి ఫీజుతో శిక్షణను సుల్తానాబాద్ లో  స్వప్న కాలనీ లో ట్రైనింగ్ సెంటర్ ద్వారా అందివడం జరిగితుంది. ఈ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న టైలరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్ విద్యార్థులకు ఘనంగా సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ నటుడు, యూట్యూబర్ అంజిమామా చేతుల మీదుగా శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ సందర్భంగా ఎర్త్ ఫౌండేషన్ డైరెక్టర్ వెన్నెల మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడినప్పుడే నిజమైన ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకొని మహిళలు ఉన్నత స్థాయికి ఎదగాలనిఆకాంక్షించారు. అదేవిధంగా ఫౌండేషన్ సెంటర్ ఇన్‌చార్జి బుచ్చిబాబు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ నేర్చుకున్న విద్యను వృథాచేయకుండా, తమకు నచ్చిన రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.

ముఖ్య అతిథి అంజిమామా మాట్లాడుతూ ఎర్త్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు కేవలం వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ అభివృద్ధికి కూడా ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. మొదట తమ గ్రామంలో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమాలు నేడు మూడు రాష్ట్రాలకు విస్తరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఎంతోమందికి ఉచితముగా శిక్షణ అందించడమే కాకుండా, సర్టిఫికెట్లు అందించడం, టైలరింగ్‌లో ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.ఇదే కార్యక్రమంలో  ARIES Agro Private Limited కంపెనీ 57 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎర్త్ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, కార్యక్రమానికి హాజరైన సుమారు 250 మందికి కంపెనీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ కోఆర్డినేటర్లు రాజు, శ్రీనివాస్, లత, శ్రీధర్, స్వప్నతో పాటు ARIES కంపెనీ మేనేజర్ D. రాజారెడ్డి, కరీంనగర్ ఇన్‌చార్జి తుంగ శ్రీనివాస్, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు