తెలంగాణ చరిత్రను తవ్వితే జనగామే కనిపిస్తుంది!
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ, నవంబర్ 29 (విజయక్రాంతి): జనగామలో(Jangaon) జరిగిన దీక్షా దివస్ సభలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) మాట్లాడుతూ, తెలంగాణ సాధన కేసీఆర్(KCR) నాయకత్వంతోనే,సాధ్యమైంని అన్నారు. అమరవీరుల కుటుంబాలను కేసీఆర్(KCR) ఎన్నడూ విస్మరించలేదు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు(Shankaramma) ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది మేమే. జనగామలో ఇటీవల ముగ్గురు యువకుల మరణం బాధాకరం. సమస్యలు ముందే తెలిస్తే పరిష్కరించేవాళ్లం.
దేవాదుల, సమ్మక్క సాగర్ నీళ్లను(Waters from Devadula and Sammakka Sagar) జనగామకు అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే హక్కు ఎక్కడిది? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై(KCR, KTR, Harish Rao) అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి. కార్యకర్తలు వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుకు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మాజీ మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్స్, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.