కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపు

29-11-2026 | 05:35pm

ఖానాపూర్, నవంబర్ 29 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన దీక్ష కీలక మలుపుగా నిలిచిందని ఖానాపూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూక్యా జాన్సన్ నాయక్ అన్నారు. ఆదివారం ఖానాపూర్‌లోని తెలంగాణ చౌక్ వద్ద దీక్షా దివస్ (Deeksha Diwas) కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముందుగా మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలతో బైక్ ర్యాలీ (Bike Rally) నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో భూక్యా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో దీక్ష ప్రారంభించిన కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేశారని అన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన త్యాగం కొనియాడదగినదని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ షోయబ్ హుస్సేన్, కౌన్సిలర్లు తొడసం ఇందిర, గౌరీకర్ రాజు, రాథోడ్ రాము నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు