గల్ఫ్ ఆట గ్రూపు ఫౌండేషన్‌లో అంకుసాపూర్ వాసులకు కీలక పదవులు
తంగళ్లపల్లి, నవంబర్ 29 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు ప్రవాస భారతీయులకు గల్ఫ్ ఆట గ్రూపు ఫౌండేషన్‌లో కీలక పదవులు లభించాయి. సావనపెల్లి బాలయ్య కోఆర్డినేటర్‌గా, మీడిదొడ్డి కనకరాజు స్పోర్ట్స్ సెక్రటరీగా ఎంపికయ్యారు.
ఒమాన్‌లోని సలాలాలో ఏర్పాటైన గల్ఫ్ ఆంధ్ర తెలంగాణ అసోసియేషన్ (Gulf Association) ఆధ్వర్యంలోని ఈ ఫౌండేషన్ ప్రవాస భారతీయుల సంక్షేమం (Welfare) కోసం పనిచేస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ తదితర జిల్లాలకు చెందిన పలువురిని వివిధ బాధ్యతలకు ఎంపిక చేశారు.
అంకుసాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు ప్రవాస భారతీయులు ఫౌండేషన్‌లో కీలక బాధ్యతలు చేపట్టడంపై గ్రామస్థులు, మిత్రులు హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రవాస భారతీయుల సంక్షేమానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.