సమాజానికి మేల్కొల్పు పిలుపు
బి ప్రేమ్ లాల్ ను సన్మానించిన కామారెడ్డి తెరవే ప్రతినిధులు
కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): సామాజిక అంశాలతో(Social issues) ఆలోచింపజేసే విధంగా పిలుపు పుస్తకంలోని కవితలు ఎన్నో కదిలిస్తాయని ఎన్నిల ముచ్చట్లు ప్రధాన సమన్వయకర్త ప్రముఖ కవి రచయిత(Poet and writer) ఎనిశెట్టి గంగా ప్రసాద్(Enisetti Ganga Prasad), తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ అన్నారు. ప్రముఖ కవి బి ప్రేమ్ లాల్(Prominent poet B. Prem Lal) రచించిన పిలుపు పుస్తక సమీక్ష కార్యక్రమం తెరవే కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఆది వారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పుస్తక ప్రధాన సమీక్షకులు ఎనిశెట్టి గంగా ప్రసాద్ , కాసర్ల రామచంద్రం లు మాట్లాడుతూ పతనమవుతున్న నైతిక విలువలను, పర్యావరణ పరిరక్షణను(environmental protection) సామాజిక విలువలను తెలుపుతూ యువతకు అవసరమయ్యే సందేశాన్నిచ్చే విధంగా పిలుపు పుస్తకంలోని కవితలు సరళమైన భాషలో ఆకట్టుకునే వైవిధ్యంతో చిన్న పదాలలో అనంత భావాన్ని తెలిపే విధంగా ఉన్నాయని అన్నారు.పిలుపు పుస్తకాన్ని ఎనిశెట్టి గంగా ప్రసాద్, కాసర్ల రామచంద్రం సమీక్షించారు.
ఈ సందర్భంగా పుస్తకంలోని కవితలను కాసర్ల రామచంద్రం, రవీందర్ కౌడి. చంద్రకాంత్, సంఘ గౌడ్ , తిరుపతిరావు, అల్లాడి నరసయ్య, తదితరులు కవిత గానాలు చేశారు. పుస్తక రచయిత ప్రేమ్ లాల్ మాట్లాడుతూ సమాజానికి అవసరమైన మరిన్ని రచనలను చేస్తానన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచయిత ప్రేమ్ లాల్ ను తెరవే పక్షాన సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎన్నీల ముచ్చట్లు ప్రధాన సమన్వయకర్త ఎనిశెట్టి గంగా ప్రసాద్, తెరవే జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల రామచంద్రం, అల్లాడి నర్సయ్య, కార్యదర్శులు తిరుపతిరావు, చంద్రకాంత్, కౌడి రవీందర్, సంఘ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.