సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా అల్పతి నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
తరిగొప్పుల, నవంబర్18 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ(Congress Party) మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా సభావత్ అల్పతి నాయక్(Sabhavath Alpati Nayak) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షురాలుగా ఏరువా సుజాత, ప్రధాన కార్యదర్శిగా కావటి సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తరిగొప్పుల మండలంలోని(Tarigoppula Mandal) సర్పంచులందరూ ఏకగ్రీవంగా వీరిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అల్పతి నాయక్ మాట్లాడుతూ...
నాపై నమ్మకంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సర్పంచులందరికీ కృతజ్ఞతలు. సర్పంచుల హక్కుల కోసం, గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడుతాను. మండలంలోని ప్రతి గ్రామంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తాను తెలిపారు.