2 September, 2026 | 7:22 PM

వైఎస్ఆర్ సంక్షేమ పాలన చిరస్మరణీయం

02-09-2026 | 06:49pm

17వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కు ఘన నివాళులు

భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 02 ( విజయక్రాంతి ): డాక్టర్ వైఎస్ఆర్(Dr. YSR) సంక్షేమ పాలన చిరస్మరణీయమని డీసీసీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్(Battu Karnakar) అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్(Ambedkar) కూడలిలో బుధవారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించగా జిల్లా అధ్యక్షులు కర్ణాకర్ ముఖ్య అతిధిగా పాల్గొని వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కర్ణాకర్ మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ(Aarogyasri) పథకాన్ని ప్రవేశపెట్టి పేదలకు ఖరీదైన వైద్య చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చారని ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుందని అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేశారని, 108 అంబులెన్స్ సేవలను, 104 వైద్య సేవలను బలోపేతం చేశారని కొనియాడారు. మహిళల ఆర్థిక స్వాలంబన కోసం పావలా వడ్డీ రుణాల(Interest bearing loans)ను అందించి స్వయం సహాయక సంఘాల మహిళలకు అండగా నిలిచారని, రైతుల కోసం ఉచిత విద్యుత్, జలయజ్ఞం వంటి అనేక కార్యక్రమాలను చేపట్టి వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.