మహిళలకు జ్యూట్ బ్యాగుల తయారీపై ఉచిత శిక్షణ
ఆలేరు, అక్టోబర్ 7 (విజయక్రాంతి): ఆలేరు మండలం శ్రీనివాసపురం గ్రామంలో కెనరా బ్యాంక్–యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(Rural Self-Employment Training Institute) ద్వారా మహిళలకు ఉచితంగా జ్యూట్ బ్యాగుల తయారీపై శిక్షణ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బెండరీ అధికారి (DVAHO), గ్రామీణ అభివృద్ధి ఉపాధి శిక్షణ సంస్థ అడిషనల్ డైరెక్టర్ డా. కె. రమేష్ పాల్గొని శిక్షణ పొందుతున్న మహిళలకు మోటివేషన్ క్లాస్ నిర్వహించారు.
స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని మహిళలకు సూచించారు. జ్యూట్ బ్యాగుల తయారీ ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఇంటి నుంచే ఉపాధి పొందే అవకాశాలపై అవగాహన కల్పించారు. మహిళలు శిక్షణను పూర్తిగా వినియోగించుకుని భవిష్యత్తులో స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని డా. రమేష్ సూచించారు.