మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం స్ఫూర్తిదాయకం
వికసిత్ భారత్ సంకల్ప సభలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు
ఆలేరు, అక్టోబర్ 7 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఊట్కూరు అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని జగ్జీవన్‌రామ్ విగ్రహం వద్ద సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా వికసిత్ భారత్ సంకల్ప సభ(Viksit Bharat Sankalp Sabha), సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని కార్యకర్తలతో కలిసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గుజరాత్ ముఖ్యమంత్రిగా 2001 అక్టోబర్ 7న బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దేశ ప్రధానిగా మూడుసార్లు బాధ్యతలు చేపట్టారని అన్నారు.
జన్‌ధన్, స్వచ్ఛ భారత్, ఉజ్వల, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలతో దేశ అభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణమే లక్ష్యంగా బీజేపీ కార్యకర్తలు ప్రజల మధ్య ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సేవా జ్యోతి ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలే చంద్రశేఖర్, తుమ్మల మురళీధర్‌రెడ్డి, మాయ దశరథ, జైనపల్లి శ్యాంసుందర్‌రెడ్డి, పట్నం శ్రీనివాస్, గూడూరు నరోత్తంరెడ్డి, కొప్పుల యాదిరెడ్డి, చందా మహేందర్ గుప్తా, కాదూరి అచ్చయ్య, కామిటికారి కృష్ణ, వైజయంతి, మేడి కోటేష్, ఆకుతోట రామకృష్ణ, మంగు నరసింహారావు, రత్నపురం బలరాం, దయ్యాల కుమార్, వంగేటి సుచరిత, స్వర్ణలత, యాస్మిన్, మాధురి చంద్ర, దాసరి మల్లేశం, పడమటి జగన్మోహన్‌రెడ్డి, సుర్వి శ్రీనివాస్, సుదగాని ఉదయ్, రాళ్లబండి కృష్ణాచారి, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.