దహన సంస్కారాలకు ఉచిత కట్టెల పంపిణీకి శ్రీకారం

07-10-2026 | 07:26pm

కాగజ్‌నగర్, అక్టోబర్ 7 (విజయ క్రాంతి):నిరుపేదలు దహన సంస్కారాల కోసం కట్టెలు కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కాగజ్‌నగర్‌లో ఉచిత కట్టెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Former Sirpur MLA Koneru Konappa ) తెలిపారు.

గతేడాది కౌటాలలో ప్రారంభించిన ఈ కార్యక్రమం 16 నెలలు పూర్తయిన సందర్భంగా కాగజ్‌నగర్‌లోనూ సేవలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.పంట కాలంలో విద్యుత్ కోతలతో రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కోతలను నిలిపివేసి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు