సైక్లింగ్ పోటీల్లో రేగొండ విద్యార్థినుల ప్రతిభ
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
భూపాలపల్లి (రేగొండ), నవంబర్ 06 (విజయక్రాంతి): 70వ ఎస్‌జీఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీలు(District-level cycling competitions) వరంగల్‌లోని దేశాయిపేట ఉన్నత పాఠశాలలో(Desaipet High School) నిర్వహించారు. ఈ పోటీల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు(Regonda ZPHS School) చెందిన విద్యార్థినులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. అండర్-14 బాలికల విభాగంలో వై. అంజలి, అండర్-17 బాలికల విభాగంలో ఎం. గౌతమి అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థినులను రేగొండ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ విజిత, జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి సీహెచ్ రఘు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల బృందం ప్రత్యేకంగా అభినందించారు.