బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా పుల్యల అశోక్
04-11-2026 | 06:50pm
భూపాలపల్లి టౌన్, నవంబర్ 04 (విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా(BJP SC Morcha ) జిల్లా ఉపాధ్యక్షుడిగా పుల్యల అశోక్‌ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు పుల్యల రాజు తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అందించిన సేవలను గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పుల్యల రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధితో పాటు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తానని అన్నారు.