దసరా మహోత్సవ ఛాంపియన్ ట్రోఫీ ప్రారంభం

14-10-2026 | 08:00pm

యువతలో ఐక్యత, క్రీడాస్ఫూర్తి పెంపొందించడమే లక్ష్యం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం 

పెద్దపల్లి జిల్లా (విజయక్రాంతి): మంథని ప్రాంతంలోని పారుపల్లి గ్రామంలో దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న దసరా మహోత్సవ ఛాంపియన్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్‌(Champion Trophy Cricket Tournament)ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, పారుపల్లి గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్, జిల్లా కార్యదర్శి అంబటి చంద్రమౌళి, జిల్లా కార్యనిర్వాహక సభ్యుడు తలపల్లి కుమార్ గౌడ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు గాదం శ్రీనివాస్, యువజన అధ్యక్షుడు బక్కతట్ల వినీత్, గ్రామ శాఖ అధ్యక్షుడు కోల విజయ్ కలిసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. 

యువత క్రీడల్లో రాణించాలి

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ క్రీడలు యువతలో ఐక్యత, స్నేహభావం, క్రమశిక్షణతో పాటు క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి టోర్నమెంట్ల నిర్వహణ ద్వారా యువ క్రీడాకారుల్లోని ప్రతిభ వెలుగులోకి వస్తుందని పేర్కొన్నారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు.

దసరా పండుగ సందర్భంగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ గ్రామ యువతలో ఉత్సాహాన్ని నింపుతోందని నిర్వాహకులు తెలిపారు. టోర్నమెంట్‌ను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు, వార్డు సభ్యులు, యువతీ యువకులు, క్రీడాకారులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు