ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల్లో అక్రమ వసూళ్లు ఆపాలి
ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి
గణపురం, నవంబర్ 29 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేటు గృహ నిర్మాణ ఏఈలపై చర్యలు తీసుకోవాలని ధర్మ సమాజ్ పార్టీ(Dharma Samaj Party) జిల్లా ప్రధాన కార్యదర్శి కండె రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం గణపురంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటికి రూ.5 వేల చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా లబ్ధిదారులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. ప్రైవేటు ఏఈ వ్యవస్థను రద్దు చేసి, ఎంపీడీవో కార్యాలయం నుంచి సీనియర్ అధికారిని నియమించాలని కోరారు. ప్రతి ఇంటికి అదనంగా రూ.లక్ష పెంచి, బిల్లులను సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేశారు.