రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన

27-11-2026 | 05:35pm

ఫ్రోబెల్ మోడల్ హైస్కూల్‌లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

గణపురం, నవంబర్ 27 (విజయక్రాంతి): గణపురం మండల(Ganapuram Mandal) కేంద్రంలోని ఫ్రోబెల్ మోడల్ హైస్కూల్‌లో(Frobel Model High School) రాజ్యాంగ దినోత్సవ(Constitution Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రసంగం, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు(Competitions in speech, essay writing, and drawing) నిర్వహించి, అనంతరం రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి ప్రతిజ్ఞ చేశారు. పోటీల్లో ప్రసంగంలో పోసాని వైశాలి, వ్యాసరచనలో తనుశ్రీ, చిత్రలేఖనంలో మూషం శాన్వి ప్రథమ బహుమతులు సాధించారు. విజేతలకు పాఠశాల ప్రిన్సిపాల్  ల్యాదల్ల కృష్ణ గౌడ్ కరస్పాండెంట్, పబ్బ శంకర్ గౌడ్, డైరెక్టర్లు ల్యాదల్ల యాదగిరి గౌడ్, సుంకరి జగన్ రెడ్డి లు బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్  కృష్ణ మాట్లాడుతూ రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణ, సమానత్వం, సోదరభావంతో  బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు