ముత్తూట్ బ్రాంచ్ ప్రారంభం
27-11-2026 | 06:14pm
మహబూబాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కురవి మండల కేంద్రంలో ముత్తూట్ బ్రాంచ్(Muthoot branch) ను గ్రామ సర్పంచ్ బాదావత్ లక్ష్మి రాజు నాయక్(Sarpanch Badavath Lakshmi Raju Naik), ఉప సర్పంచ్ ఎర్ర నాగేశ్వరరావు, సంగం సునీత నాగరాజు ప్రారంభించారు. ముత్తూట్ బ్రాంచ్ ద్వారా కురవి ప్రాంత ప్రజలకు అందించే సేవలను రీజినల్ మేనేజర్ శ్రీనివాస్(Regional Manager Srinivas) తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ మేనేజర్ రాజు, వార్డు సభ్యులు దైద ద భద్రయ్య, ఆమెడ మల్లికార్జున్, కార్యదర్శి రాజేష్ పాల్గొన్నారు.