చంద్రపురి కాలనీలో అభివృద్ధి పనులకు శ్రీకారం
రూ.1.36 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం
జవహర్నగర్,(విజయక్రాంతి): కీసర సర్కిల్ చంద్రపురి కాలనీలో సీసీ రోడ్లు(CC Roads), డ్రైనేజీ నిర్మాణ పనులకు రూ.1.36 కోట్ల నిధులతో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా(Medchal–Malkajgiri District) కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ పనులతో కాలనీలో రహదారుల సమస్యలు, మురుగునీటి ఇబ్బందులు తగ్గనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్, మాజీ కార్పొరేటర్ వేణు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.