మూఢనమ్మకాల నిర్మూలనకు పోలీసుల కళాజాత

12-11-2026 | 11:50pm

- బూడుగుల గ్రామంలో నాటకాల ద్వారా ప్రజలకు అవగాహన

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్(SP Rohit Raju IPS) సూచనల మేరకు, మణుగూరు డీఎస్పీ వి.రవీంద్రారెడ్డి(Manuguru DSP V. Ravindra Reddy) ఆధ్వర్యంలో బూడుగుల గ్రామంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మూఢనమ్మకాల వల్ల కలిగే అనర్థాలను నాటక రూపంలో కళాకారులు వివరించారు. సమాజంలో వేళ్లూనుకున్న అంధవిశ్వాసాలు, తప్పుడు నమ్మకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.

మంత్రాలు, చేతబడులు వంటి అపోహలను నమ్మి భయాందోళనలకు గురికావద్దని, అనుమానాల ఆధారంగా ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని సందేశాన్ని అందించారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బూడుగుల సర్పంచ్ మాధవి, మణుగురు సీఐ నాగబాబు, ఎస్సైలు నగేష్, మహమ్మద్ రవూఫ్,పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు