ఉపాధి హామీ పనులు పరిశీలించిన సర్పంచ్
గణపురం,నవంబర్ 18 (విజయ క్రాంతి): మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువులో(Ganapasamudram Lake) జరుగుతున్న ఉపాధి హామీ పనులను బుధవారం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ పరిశీలించారు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విబిజి రాంజీ పథకాన్ని ఉపాధి కూలీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నాలుగు గంటల పాటు పనిచేసి 307 రూపాయలు కూలి పొందాలన్నారు, కొలతల ప్రకారంగా పనులు చేయాలన్నారు.వలసలు నివారించేందుకు ప్రవేశపెట్టిన ఈ పనులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు, సరైన సమయానికి హాజరై రెండు ఫోటోలు దిగి అధికారులకు సహకరించాలన్నారు, ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి చోటే మియా, వార్డు సభ్యులు పసునూటి సౌమ్య శంకర్, చందు అభేద, నేరెళ్ళ లక్ష్మి శంకర్, మండ అశోక్, ఫీల్డ్ అసిస్టెంట్ దూలం శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.