కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం

06-10-2026 | 06:48pm

మహాదేవపూర్ అక్టోబర్ 06 విజయక్రాంతి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పలుగుల గ్రామ పంచాయతీ(Gram Panchayat) పరిధిలో ఎలిప్స్ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు నిర్వహించిన కుట్టు మిషన్ శిక్షణ కార్యక్రమం(Sewing Machine Training Program) పూర్తయింది. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను అందజేశారు.మహిళలు ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు కుట్టు మిషన్ శిక్షణ అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

శిక్షణ పొందిన మహిళలు సర్టిఫికెట్లను ఉపయోగించుకుని బ్యాంకు రుణాలు, వివిధ స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. కుట్టు మిషన్లతో పాటు పేపర్ ప్లేట్ల తయారీ వంటి ఇతర ఉపాధి అవకాశాలను కూడా వినియోగించుకోవచ్చని తెలిపారు.

మారుమూల ప్రాంతమైన పలుగులలో మహిళలకు శిక్షణ అందించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారే విజయలక్ష్మి, శంకర్, వార్డు సభ్యులు, ఎమ్మెస్ సెం మీ కౌన్సిలర్ రజిత ట్రైనర్ కోరుకోప్పుల మమత  గ్రామస్తులు, శిక్షణ పొందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు