అంకుర ఆసుపత్రిలో డీఎంఅండ్ హెచ్ఓ ఆకస్మిక తనిఖీ

06-10-2026 | 07:19pm

నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించిన డీఎంఅండ్ హెచ్ఓ 

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం పట్టణంలోని అంకుర ఆసుపత్రి(Ankura Hospital)ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు మంగళవారం ఆకస్మికంగా సందర్శించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని రికార్డులు, లేబొరేటరీ (ల్యాబ్), స్కానింగ్ విభాగాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలు, ల్యాబ్ పరీక్షల ప్రమాణాలు, స్కానింగ్ సేవల వివరాలతో పాటు సంబంధిత రిజిస్టర్లను నిశితంగా పరిశీలించారు. 

ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డా. రామారావు మాట్లాడుతూ ఆసుపత్రిలో నిర్వహించే ప్రతి విభాగం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, అన్ని విభాగాల రికార్డులను ఎప్పటికప్పుడు పక్కాగా నమోదు చేస్తూ, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టాన్ని తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన  చర్యలు తీసుకుంటామని యాజమాన్యానికి స్పష్టం చేశారు. ఈ తనిఖీ సమయంలో అంకుర ఆసుపత్రి మేనేజర్ రామారావు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు