ప్రజలకు న్యాయమైన పోలీస్ సేవలు అందించాలి
- నేరాల నియంత్రణకు నిరంతరం కృషిచేయాలి,
- ప్రతి పిర్యాదులకు ప్రాధాన్యతనివ్వాలి.
- జిల్లా ఎస్పీ సిరి శెట్టి సంకీర్త్,
పలిమెల. నవంబర్ 18. (విజయక్రాంతి ) : ప్రజలకు వేగవంతమైన నాణ్యమైన పోలీస్ సేవలు(Police Services) అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరి శెట్టి సంకీర్త్(Jayashankar Bhupalpally District SP Siri Shetti Sankeerth) అన్నారు. బుధవారం వార్షిక తనిఖీలో భాగంగా పలిమెల పోలీస్ స్టేషన్ను ఆయన సందర్శించారు. స్టేషన్లోని జనరల్ డైరీ, క్రైమ్ రికార్డులు, పెండింగ్ కేసులు(Pending cases), యూఐ కేసులు, సీసీటీఎన్ఎస్లో కేసుల నమోదు(Registration of cases), కోర్టు కేసుల పురోగతి, సమన్లు, వారెంట్ల అమలు తదితర అంశాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు.
పెండింగ్ కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి, సాక్ష్యాధారాలు సేకరించి త్వరితగతిన పరిష్కరించాలని, పాత నేరస్తులు, రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని ఆయన సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ, రాత్రి గస్తీ, పెట్రోలింగ్, వాహన తనిఖీలు, రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణపై సమీక్షించారు.మహిళలు, బాలలు, వృద్ధులు, బలహీన వర్గాల ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి చట్టప్రకారం న్యాయం చేయాలని తెలిపారు.
సైబర్ నేరాలు(Cybercrimes), ఆన్లైన్ మోసాలు(Online Scams), మహిళల భద్రత, బాల్యవివాహాలు, మాదకద్రవ్యాలు, రోడ్డు భద్రతపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.సిబ్బంది క్రమశిక్షణ, సమయపాలన, సంక్షేమం, స్టేషన్ మౌలిక సదుపాయాలు, వాహనాలు,ఆయుధాల నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించేలా విధులు నిర్వహించాలని, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, మహదేవ్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. వెంకటేశ్వర్లు, పలిమెల ఎస్సై సాయి శశాంక్.
ఈ తనిఖీలో పలిమెల పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.