ఉపేందర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎస్విఈసీ ప్రతినిధులు
గణపురం, నవంబర్ 25 (విజయక్రాంతి): మండలంలోని పరశురాంపల్లి ఓసీ-3లో ఎస్విఈసీ కంపెనీ(SVEC Company)లో వాల్వో డ్రైవర్గా పనిచేస్తున్న బుద్ధారం గ్రామానికి చెందిన రాపెల్లి ఉపేందర్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కంపెనీ ప్రతినిధులు చిట్టిబాబు, రవి ఉపేందర్ స్వగ్రామానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఉపేందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాల్వో డ్రైవర్స్ యూనియన్ నాయకులు మాచర్ల కనకయ్య ముదిరాజ్, పుప్పాల దీపక్ పటేల్, బండారి సురేందర్ యాదవ్, శ్రీరాముల రవి, కుమార్ రెడ్డి, గండు దేవేందర్, రమేష్, చాతరాజు లక్ష్మీనారాయణ, బండారు ఉపేందర్, శివ, యాకూబ్ తదితర ఆపరేటర్లు, కార్మికులు పాల్గొన్నారు.