అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి భూమి పూజ
రాజాపూర్ నవంబర్ 25: అయ్యప్ప స్వామి దీక్ష ఎంతో శ్రేష్టమైనది మాజీ మంత్రి లక్ష్మారెడ్డి(Former Minister Laxma Reddy) మాజీ ఎమ్మెల్యే రాజశేఖర్ అన్నారు. బుధవారం మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మీనా శేఖర్ గౌడ్, డిసిఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింలు, మాజీ ఎంపీపీ వైస్ మైపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ బచ్చిరెడ్డి మల్లేష్ గౌడ్ తో పాటు మండల మాజీ ఎంపీపీ లు, మాజీ, వైస్ ఎంపీపీ, పలు గ్రామల సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, మండల నాయకులు కార్యకర్తలు, అయ్యప్ప స్వాములు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.