తిరువరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించకపోవడంపై నిరసన

25-11-2026 | 11:52pm

సీఎం విజయ్‌కు సద్బుద్ధి కలగాలని శివాలయంలో పూజలు

మహబూబాబాద్ టౌన్, నవంబర్ 25 (విజయక్రాంతి): తిరువరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించకుండా అడ్డుకోవడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం(National BC Welfare Association) రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్‌కు సద్బుద్ధి కలగాలని మానుకోటలోని స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయస్థానాల ఆదేశాలు ఉన్నప్పటికీ దీపం వెలిగించకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలకు విరుద్ధమని విమర్శించారు. హిందువుల సంప్రదాయాలు, మనోభావాలను గౌరవించాలని, మతపరమైన అంశాల్లో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. హిందూ సమాజం ఐక్యంగా ఉండి ఇలాంటి పరిణామాలను ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు