కిషన్ రెడ్డి పాదయాత్రకు మద్దతు
25-11-2026 | 11:31pm
ఎల్బీనగర్, నవంబర్ 25: డ్రగ్స్ రహిత హైదరాబాద్ లక్ష్యంగా కిషన్ రెడ్డి పాదయాత్రకు ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్ కు చెందిన బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. డ్రగ్స్ రహిత హైదరాబాద్ నిర్మాణమే లక్ష్యంగా ఈ నెల 25 నుంచి 27 వరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) మూడు రోజుల పాదయాత్ర నిర్వహిస్తున్నారు. పాదయాత్రకు మద్దతుగా ఎరుకల మల్లేశ్ గౌడ్ ఆధ్వర్యంలో హస్తినాపురం డివిజన్ కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు జడ్పీరోడ్డు నుంచి ఆర్ఎస్ఎస్ జంక్షన్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించి, పాదయాత్రలో పాల్గొన్నారు.