పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలి

25-11-2026 | 11:39pm

- మాజీ మంత్రి, సుర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి 

- గడ్డి అన్నారం డివిజన్ లో ఎంబీ మల్టీ స్పెషాలిటీ  హాస్పిటల్ ప్రారంభం 

ఎల్బీనగర్, నవంబర్ 25: ఎల్బీనగర్ నియోజకవర్గం గడ్డి అన్నారం డివిజన్ కృష్ణవేణి నగర్ పరిధిలోని ఎంబీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను బుధవారం మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి(MLA Guntakandla Jagadish Reddy) ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... పేద, గొప్ప అనే తేడా లేకుండా మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు.

ఎంబీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ మారుకంటి  భానుచందర్, చిలివేరి బాలకృష్ణ, డాక్టర్ మారుకంటి  బాలమురళి, మారుకంటి ఉదయ్ తదితరులు మాట్లాడుతూ... ఎంబీ దవాఖానలో మెరుగైన వైద్యాన్ని అందిస్తామన్నారు. హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో టీ పీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి, నల్లెంకి  ధన్ రాజ్ గౌడ్, ఇమ్రాన్ అలీ, దేప మహీందర్ రెడ్డి, రాజకుమార్, జ్ఞానేశ్వర్ యాదవ్, శేఖర్ ముదిరాజ్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు