దేవాలయాలు దైవచింతనకు మార్గాలు
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..
రాజాపూర్ నవంబర్ 25: మానవాళికి దేవాలయాలు భక్తి మార్గాన్ని పెంపొందించడంతోపాటు దైవచింతన కు ప్రత్యేక మార్గాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) అన్నారు. బుధవారం మండలంలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించడం ఎంతో శుభదాయకమని అన్నారు. ప్రజలు భక్తిమార్తాన్ని అనుసరించి సుఖశాంతులతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మీనా శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్, మాజీ ఎంపిటిసి సునీత శ్రీనివాస్ నాయక్, నారాయణ గౌడ్, శేఖర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.