ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన సదస్సు
రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ప్రజలకు పథకంపై అవగాహన కల్పించాలని అధికారుల సూచన!
మల్దకల్ నవంబర్ 18 : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల గ్రామ ప్రజలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి(Indiramma Family Life Insurance Scheme) సంబంధించి రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్న నేపథ్యంలో సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, రేషన్ డీలర్లు, జీపీ ఓలకు పథకానికి సంబంధించిన విధివిధానాలు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియపై అవగాహన కల్పించారు.
ఈ అవగాహన సదస్సుకు ఎంపీడీవో (MPDO), ఎంపీవో (MPO), రెవెన్యూ సీనియర్ సహాయకులు హాజరయ్యారు. పథకానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు వివరించి, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను సమన్వయంతో నిర్వహించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు.