అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం
మేనిఫెస్టో హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
పటాన్చెరు/ గుమ్మడిదల నవంబర్ 18 : ఎన్నికల మేనిఫెస్టోలో(Election manifesto) ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు(Welfare schemes) అందిస్తున్నామని రాష్ట్ర శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Bearded Vivek Venkataswamy) అన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో(Patancheru Constituency) నూతనంగా ఎంపికైన 3,350 మంది లబ్ధిదారులకు(Beneficiaries) చేయూత పింఛన్(Pension) పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నాలుగు లక్షల మందికి, సంగారెడ్డి జిల్లాలో 18,591 మందికి పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు తదితర పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పటాన్చెరులో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు, కలెక్టర్ ప్రతీక్ జైన్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.