శ్యామ్గఢ్ కోట అక్రమలపై చర్య తీసుకోవాలి
నిర్మల్ నవంబర్ 18 ( విజయ క్రాంతి) : నిర్మల్ పట్టణంలోని(Nirmal town) చారిత్రక శ్యామ్గఢ్ కోట భూముల(Lands of the historic Shyamgarh Fort) రెవెన్యూ రికార్డుల్లో(Revenue record) ప్రైవేట్ వ్యక్తుల పేర్లు నమోదైన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఏవో ప్రవీణ్ కుమార్‌కు AAP రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటకు సంబంధించిన పాత రెవెన్యూ రికార్డులు, ఖాస్రా పహాణీ, సేత్వార్, సర్క్యులర్ ముంతఖబ్లను పరిశీలించాలని కోరారు. అలాగే అక్రమంగా జారీ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పట్టాదారు పాస్‌బుక్కులు, పహాణీలలో నమోదైన ప్రైవేట్ వ్యక్తుల పేర్లపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత రికార్డులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని చారిత్రక శ్యామ్గఢ్ కోట ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరారు.