చేయూత పథకంతో పేదలకు ఆర్థిక భరోసా
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, (విజయ క్రాంతి ) : మంచిర్యాల జిల్లా(Mancherial District) జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 875 నూతన లబ్ధిదారులకు(beneficiaries) భరోసా పత్రాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Wedma Bojju Patel) అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇంట్లో మహిళలు సంతోషంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటదని, మహిళలు ప్రతి అవసరానికి ఇతరులపై ఆధారపడకుండా ఆర్థికంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల మంజూరు చేసి అండగా ఉంటున్నామన్నారు.
గీత కార్మికులు నేత కానుకలతో పాటు వివిధ వర్గాలకు చెందిన అర్హులకు పింఛన్లు అందిస్తున్నామన్నారు. మహిళా సంఘ సభ్యులు తీసుకునే రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు డి ఆర్ డి ఓ దాసరి అంజయ్య, తహసిల్దార్ బక్కయ్య, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, పొనకల్ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్, కాంగ్రెస్ మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.